భారత్ లో ముస్లిం జనాభా పెరుగుదల..అమిత్ షా కీలక ప్రకటన

భారత్ లో ముస్లిం జనాభా పెరుగుదల..అమిత్ షా కీలక ప్రకటన

కేంద్ర హోంమంత్రి (Central Home Minister) అమిత్ షా (Amit Shah) దేశంలో ముస్లిం జనాభా పెరుగుదలపై శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పాకిస్థాన్  (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) నుండి జరుగుతున్న చొరబాట్లేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి చెప్పిన వివరాల ప్రకారం, దేశంలో ముస్లిం జనాభా 24.6 శాతం పెరగగా, హిందూ జనాభా 4.5 శాతం తగ్గింది. ఈ పెరుగుదలకు సంతానోత్పత్తి రేటు (Fertility Rate) కారణం కాదని, చొరబాట్ల వల్లే జనాభాలో ఈ గణనీయమైన మార్పు వచ్చిందని షా నొక్కి చెప్పారు.

ఢిల్లీ (Delhi)లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, దేశంలో ఓటు హక్కు కేవలం భారత పౌరులకు మాత్రమే ఉండాలని ఉద్ఘాటించారు. ఎన్నికల కమిషన్ (EC) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను రాజకీయ కోణంలో కాకుండా జాతీయ సమస్యగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన చొరబాటుదారుడికి (Intruder), శరణార్థికి (Refugee) మధ్య తేడాను వివరిస్తూ, చొరబాటుదారులు మత హింసను ప్రేరేపించడానికి లేదా ఆర్థిక కారణాల వల్ల చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశిస్తారని తెలిపారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌లోని SIR ప్రక్రియపై ప్రతిపక్షాల విమర్శలను కూడా అమిత్ షా ప్రస్తావించారు. ఓటరు జాబితాను అధికార ఎన్డీయేకు అనుకూలంగా మార్చేందుకే ఈ విధానం తీసుకువచ్చారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు సైతం ‘ఓటర్ అధికార్ యాత్ర’ (Voter Right Yatra) చేపట్టారు. అయితే, అధికార పక్షం, ఈసీ(EC) ఈ ఆరోపణలను ఖండించాయి. షా తన ప్రసంగంలో ఈ వివాదాస్పద అంశాన్ని కూడా ప్రస్తావించడం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment