టీం ఇండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అశ్విన్ తర్వాత, టీం ఇండియా నుండి రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్‌గా మిశ్రా నిలిచాడు.
అమిత్ మిశ్రా కెరీర్ హైలైట్స్
అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో 3 హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. భారతదేశం తరపున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 156 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 162 మ్యాచ్‌లలో 174 వికెట్లు తీశాడు.
రిటైర్మెంట్ వెనుక కారణాలు
తన రిటైర్మెంట్ నిర్ణయం అంత సులభం కాదని మిశ్రా తెలిపారు. పదేపదే గాయాలు అవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. భవిష్యత్తులో యువ క్రికెటర్లకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. “నేను ఎప్పుడూ జట్టుకు ప్రాధాన్యత ఇచ్చాను, ఇప్పుడు కొత్త క్రికెటర్లకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను” అని మిశ్రా పేర్కొన్నాడు.
అమిత్ మిశ్రా భారతదేశం తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2017లో ఆడాడు. ఆ తర్వాత దేశీయ క్రికెట్ మరియు ఐపీఎల్‌లో కొనసాగాడు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ అతని చివరి మ్యాచ్. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 20 పరుగులకు 1 వికెట్ తీశాడు.
అమిత్ మిశ్రా కెరీర్
టెస్ట్‌లు (22 మ్యాచ్‌లు): 648 పరుగులు, 76 వికెట్లు
వన్డేలు (36 మ్యాచ్‌లు): 43 పరుగులు, 64 వికెట్లు
టీ20ఐలు (10 మ్యాచ్‌లు): 0 పరుగులు, 16 వికెట్లు







