అల్లు అర్జున్-త్రివిక్ర‌మ్ న్యూ ప్రాజెక్ట్‌.. హీరోయిన్ ఎవ‌రంటే..

అల్లు అర్జున్-త్రివిక్ర‌మ్ న్యూ ప్రాజెక్ట్‌.. హీరోయిన్ ఎవ‌రంటే..

Summarize with AI

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సూపర్ హిట్ ప్రాజెక్ట్ రాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే చర్చ కొనసాగుతున్నప్పటికీ, వ‌రుస హిట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ మీనాక్షి చౌదరి పేరు పరిశీలనలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కథకు త‌గిన‌ట్లుగా బ‌న్నీకి జోడిగా మీనాక్షిని ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నట్లు స‌మాచారం. ఇటీవ‌ల విడుద‌లైన సినిమాల్లో మీనాక్షి చౌద‌రి తన నటనతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ కాంబినేషన్ ప్రేక్షకులను మరింత ఆసక్తిగా మార్చవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అధికారిక ప్రకటన కోసం ఎదురు చూపులు
ఈ ప్రాజెక్ట్‌పై సంబంధిత అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ తాజా పాన్ ఇండియా హిట్ పుష్ప‌-2 తర్వాత, ఈ సినిమా మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఫిక్స్ అయితే, ఇది ఆమె కెరీర్‌లో పెద్ద బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment