నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈరోజు కిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల‌ను అడిగి తెలుసుకోనున్నారు.

పోలీసుల నోటీసులు
శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళ్తే, ముందు సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో నేడు తాను ఆస్ప‌త్రికి వెలుతున్న‌ట్లు రాంగోపాల్ పేట పోలీసులకు అల్లు అర్జున్ తెలియ‌జేశారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వల్ల గాయపడిన శ్రీ‌తేజ్ కుటుంబానికి ఇప్ప‌టికే చిత్ర‌యూనిట్‌తో పాటు అల్లు అర్జున్ ఆర్థిక‌సాయం అందించారు. శ్రీ‌తేజ్ ఆస్ప‌త్రి ఖ‌ర్చులు కూడా భ‌రించేందుకు పుష్ప టీమ్ ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే.

పుష్ప-2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment