సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట కేసులో (Stampede Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా నటుడు అల్లు అర్జున్(Allu Arjun) వ్యక్తిగత కారణాల వల్ల నాంపల్లి కోర్టుకు(Nampally Court) హాజరు కాలేకపోయారు. ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు అబ్సెంట్ పిటిషన్ (Absent Petition) సమర్పించగా, గైర్హాజరుకు సంబంధించిన మెమోను దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. ఇదే సమయంలో అల్లు అర్జున్‌ను వర్చువల్‌గా (Virtually) విచారణకు హాజరయ్యేలా అనుమతించాలా లేదా అనే అంశం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉందని న్యాయవాదులు వెల్లడించారు.
మరోవైపు ఈ కేసులో మొత్తం 23 మందిపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా పేర్కొన్నారు. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప-2’(Pushpa-2) బెనిఫిట్ షో (Benefit Show) సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sritej) తీవ్రంగా గాయపడ్డాడు. కేసులోని ఇతర నిందితులు కోర్టుకు హాజరుకాగా, తదుపరి విచారణను జూలై 6వ (July 6) తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి పరిణామాలపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.








జనసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. వైసీపీ ఎమ్మెల్సీ సవాల్