అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం – భూమ‌న ఫైర్‌

అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం - భూమ‌న ఫైర్‌

Summarize with AI

తిరుమల (Tirumala) శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి (Sri Venkateswara Swamy) కొండ‌ (Hill)కు ద్వారమైన అలిపిరి (Alipiri) వద్ద ఘోర అపచారం బయటపడింది. శ్రీమహావిష్ణువు (Sri Maha Vishnu) విగ్రహాన్ని (Idol) నిర్లక్ష్యంగా పడేసిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. మలమూత్రాలు, మద్యం బాటిల్స్‌ సమీపంలోనే విగ్రహం పడేయడంపై టీటీడీ బోర్డు మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి (Bhuma Karunakar Reddy) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ్రీ‌మ‌హా విష్ణువు విగ్ర‌హాన్ని అలిపిరి ద్వారం వ‌ద్ద నిర్ల‌క్ష్యంగా ప‌డేయ‌డంపై భక్తులు, హిందూ సంఘాలు మండిప‌డుతున్నారు.

అలిపిరి ఓల్డ్ చెక్‌పాయింట్ కారు పార్కింగ్ వద్ద మ‌హా విష్ణువు విగ్రహం పడి ఉండ‌టంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ప‌రిశీలించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హిందూ దేవుళ్ల‌ విగ్రహాల పట్ల, హైందవ ధర్మం పట్ల టీటీడీ(TTD) తీవ్ర నిరక్ష్యంగా వ్యవహరిస్తుంద‌ని మండిప‌డ్డారు. మ‌హా విష్ణువు విగ్రహం ఈ ప‌రిస్థితుల్లో చూడ‌డంతో త‌న‌కు కన్నీళ్లు వస్తున్నాయన్నారు. పవిత్రమైన దేవుళ్ల విగ్రహాలను గౌరవించకుండా ఇలా వ్యవహరించడం హిందూ ధర్మంపై తీవ్రమైన అవమానమని వ్యాఖ్యానించారు.

“తక్షణమే టిటిడి చైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెంటనే స్పందించాలి. హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు మేల్కొని స్పందించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. విగ్రహం నిర్లక్ష్యం ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో అన్నది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment