మాజీ డిప్యూటీ సీఎం త‌మ్ముడి అరెస్టు.. రాజకీయ కుట్రేనా?

మాజీ డిప్యూటీ సీఎం త‌మ్ముడి అరెస్టు.. రాజకీయ కుట్రేనా?

ఏపీలో ఇటీవ‌ల వైసీపీ (YSRCP) నేతల వరుసగా అరెస్టులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ( Former Deputy CM), క‌డ‌ప వైసీపీ నేత అంజాద్ బాషా (Anjad Basha) సోదరుడు (Brother) అహ్మద్ బాషా (Ahmed Basha) అరెస్టు (Arrest) అయ్యారు. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా, ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం, ఇది కొత్త కేసు కాదని, గతంలో ఇరువర్గాల మధ్య రాజీ అయిన కేసు ఆధారంగా తిరిగి తవ్వుకున్న వ్యవహారమని చెబుతున్నారు.

క‌డ‌ప ఎమ్మెల్యే రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీ (Madhavi), ఆమె భ‌ర్త శ్రీ‌నివాస్‌రెడ్డి (Srinivas Reddy) ని దూషించార‌న్న ఫిర్యాదు నేప‌థ్యంలో అంజాద్ బాషా సోదరుడిపై ఎఫ్ఐఆర్ (FIR) న‌మోదు చేసి అరెస్టు చేశారు. ఈ అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు సర్కార్ (Chandrababu Government) అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుంటూ చర్యలు తీసుకుంటుందన్న విమర్శలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment