ఎమ్మెల్యే(MLA) కొలికపూడి శ్రీనివాసరావు (Kollikapudi Srinivasarao) ఆదేశాలతో ఉన్నతాధికారులు తనను విపరీతంగా వేధిస్తున్నారని అసిస్టెంట్ ఇంజినీర్ (Assistant Engineer) సూసైడ్ (Suicide) నోట్ రాసి అదృశ్యమైన సంఘటన సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా (NTR District) తిరువూరు (Tiruvuru)లో నీటిపారుదల శాఖ ఏఈ(AE) వి. కిషోర్ (V. Kishore) తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లగా నోట్ రాసి ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
బదిలీ ఉత్తర్వులు వచ్చినా అధికారులు రిలీవ్ చేయకపోవడంతో పలుమార్లు తాను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kollikapudi Srinivasarao), ఉన్నతాధికారులు, ఎంపీ కార్యాలయం చుట్టూ తిరిగానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక దళిత ఉద్యోగిగా తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తన బదిలీని పట్టించుకోకుండా, ఎమ్మెల్యే కొలికపూడి ఆదేశాలతో నిలిపివేసిన ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత ఉద్యోగిగా తాను ఎదుర్కొన్న అన్యాయం మరెవరూ అనుభవించకూడదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న కిషోర్, తన మృతి బాధ్యులుగా EE రంగయ్య, DEE ఉమాశంకర్, ENC శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల పేర్లు ప్రస్తావించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఎంపీలకు లేఖ రాశారు. శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన కిషోర్ ఆచూకీ నేటి వరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయ బెదిరింపులతో కిషోర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.