విజయ్ నివాసానికి నటి త్రిష.. స‌ర్వ‌త్రా ఆస‌క్తి (Video)

విజయ్ నివాసానికి నటి త్రిష.. స‌ర్వ‌త్రా ఆస‌క్తి (Video)

Summarize with AI

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(Tamil Nadu Assembly Elections) ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న వేళ, దళపతి విజయ్(Thalapathy Vijay) నివాసం వద్ద సందడి నెలకొంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారం దిశ‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే విజయ్ రూమ‌ర్డ్ గ‌ర్ల్ ఫ్రెండ్‌, నటి త్రిష కృష్ణన్(Trisha Krishnan) చెన్నైలోని(Chennai) ఆయన నివాసానికి(Residence) చేరుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

పుట్టినరోజు వేళ.. విజయ్ విజయం కోసం
నేడు త్రిష 43వ పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా ఉదయాన్నే తిరుమల శ్రీవారిని(Lord Venkateswara) దర్శించుకున్న ఆమె, వెంటనే చెన్నై చేరుకుని విజయ్‌ను కలిశారు. తన పుట్టినరోజు రోజే విజయ్ పార్టీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో, ఇది ‘డబుల్ సెలబ్రేషన్’ అని అభిమానులు ఖుషీ అవుతున్నారు. విజయ్‌ను కలిసి ఆమె బొకే అందజేసి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉద‌యం ఆమెను తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సంద‌ర్భంలోనూ విజ‌య్ పార్టీ కోస‌మే ప్ర‌త్యేక పూజ‌లు చేశార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

సందడిగా విజయ్ నివాసం
విజయ్ నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మిన్నంటుతోంది. విజయ్ కుటుంబ సభ్యులు, తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ సోదరి, ఇతర బంధువులు కూడా విజయోత్సవాల్లో పాలుపంచుకుంటున్నారు.

సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
కేవలం త్రిష మాత్రమే కాకుండా, పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు విజయ్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడు టైగర్ ష్రాఫ్ వంటి వారు కూడా “విజయ్‌పై ప్రజలకున్న నమ్మకం అద్భుతం” అని ప్రశంసించారు. త్రిష స్వయంగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment