ఆ స్థానం నుంచి త్రిష‌.. గెలిస్తే డిప్యూటీ సీఎం..?

ఆ స్థానం నుంచి త్రిష‌.. గెలిస్తే డిప్యూటీ సీఎం..?

Summarize with AI

తమిళనాడు ఎన్నికల (Tamil Nadu Elections) ఫలితాల్లో దళపతి విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ(TVK Party) సృష్టిస్తున్న సంచలనం ఇప్పుడు మరో ఆసక్తికర చర్చకు దారితీసింది. విజ‌య్ రూమ‌ర్డ్ గ‌ర్ల్‌ఫ్రెండ్, న‌టి త్రిష(Trisha Krishnan) పొలిటిక‌ల్ ఎంట్రీపై ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ గెలిచే అవకాశం ఉండటంతో, ఆయన వదులుకునే స్థానంలో నటి త్రిష పోటీ చేస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. తిరుచ్చి ఈస్ట్(Tiruchchi East), పెరంబూర్(Perambur) రెండు నియోజకవర్గాల్లోనూ భారీ ఆధిక్యంతో విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పుడు ఆ ఖాళీ అయ్యే స్థానం నుంచి త్రిష‌ పోటీ చేస్తారనే ప్ర‌చారం హల్ చల్ చేస్తోంది.

రాజీనామా చేసే స్థానంలో త్రిష?
విజయ్ రాజీనామా చేసే నియోజకవర్గం (బహుశా పెరంబూర్ లేదా తిరుచ్చి ఈస్ట్) నుండి నటి త్రిష కృష్ణన్ బరిలోకి దిగే అవకాశం ఉందని త‌మిళ‌నాడు మీడియా కొత్త జోష్యం చెబుతోంది. విజయ్ విజయం ఖాయం కావడంతో, ఈరోజు ఆయన నివాసానికి చేరుకున్న త్రిష, కేవలం అభినందనలు తెలపడానికే కాకుండా భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి కూడా ముచ్చ‌టించి ఉంటార‌ని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. విజయ్‌కు అత్యంత సన్నిహితురాలు కావడంతో, ఆమెను పార్టీలోకి ఆహ్వానించి ఆ స్థానం నుండి ఉప ఎన్నికలో పోటీ చేయించాలని టీవీకే శ్రేణులు భావిస్తున్నట్లు టాక్.

డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం!
ఒకవేళ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే లేదా ప్రధాన పార్టీగా అవతరిస్తే, త్రిషను కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, కీలకమైన ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవికి కూడా పరిశీలించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహిళా ఓటర్లను ఆకర్షించడంతో పాటు, గ్లామర్, పాపులారిటీ ఉన్న త్రిషను ప్రభుత్వంలో భాగస్వామిని చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని విజయ్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఫ్యాన్స్ మధ్య జోరుగా చర్చ
గతంలోనూ వీరిద్దరూ కలిసి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు నిజ జీవితంలో, అది కూడా రాజకీయ వేదికపై విజయ్-త్రిష జోడీని చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. “దళపతి సీఎంగా.. త్రిష డిప్యూటీ సీఎంగా ఉంటే చూడాలని ఉంది” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వార్తలపై అటు టీవీకే పార్టీ గానీ, ఇటు నటి త్రిష గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఇది మరో పెను సంచలనంగా మారడం ఖాయం.

Join WhatsApp

Join Now

Leave a Comment