గాంధీ “ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్‌.. అభిజిత్ భట్టాచార్యకు లీగల్ నోటీసు

గాంధీ "ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్‌.. అభిజిత్ భట్టాచార్యకు లీగల్ నోటీసు

ప్రముఖ గాయకుడు అభిజిత్ భట్టాచార్య, మహాత్మా గాంధీని పాకిస్తాన్‌కు “ఫాదర్ ఆఫ్ ది నేషన్” అని పిలిచాడు. దీంతో ఆయనకు న్యాయవాది అసిమ్ సోర్డే లీగల్ నోటీసు పంపించారు. ఈ నోటీసు మనీష్ దేశ్‌పాండే తరపు నుండి పంపబడ్డాయిది. నోటీసులో.. భట్టాచార్య క్షమాపణలు చెప్పాల‌ని, లేకపోతే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు.

గత నెలలో అభిజిత్ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. ఆయన మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్‌డీ బర్మన్ పెద్దవాడని, గాంధీ పాకిస్తాన్‌కు “జాతి పితామహుడు” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు భారతదేశం, పాకిస్తాన్ మధ్య తీవ్ర ప్ర‌కంప‌ణ‌లు సృష్టించాయి.

భట్టాచార్య వ్యాఖ్యలు మహాత్మా గాంధీ ప్రతిష్టను దిగజార్చుతాయన్న యాక్టివిస్టులు, న్యాయవాదులు తీవ్ర‌ ఆందోళన వ్యక్తం చేశారు. అసిమ్ సోర్డే మాట్లాడుతూ.. భట్టాచార్య చేసిన ప్రకటన మహాత్మా గాంధీ పట్ల ద్వేషాన్ని చూపిస్తుందని, ఈ వ్యాఖ్యల వల్ల గాంధీ ప్రతిష్ట దిగ‌జారుతుంద‌ని, అభిజిత్ భట్టాచార్యను క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేశారు. లేదంటే, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 353, సెక్షన్ 356 (పరువు నష్టం) కింద చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment