సింగర్ అవతారమెత్తిన పంత్.. వీడియో వైర‌ల్‌

సింగర్ అవతారమెత్తిన పంత్.. వీడియో వైర‌ల్‌

Summarize with AI

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్నాడు. తన కొత్త ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అయితే, ప్రస్తుతం పంత్ సింగర్ అవతారం ఎత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పంత్ పాకిస్తాన్ సూపర్‌హిట్ పాట ‘అఫ్సానే’ను ఆలపిస్తూ కనిపించాడు.

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఈ వీడియోను తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేయడంతో, ఇది క్రికెట్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూప‌ర్‌హిట్‌ షాట్లతో అభిమానులను అలరించే పంత్, తన సింగింగ్ టాలెంట్‌తో కూడా నెట్టింట సంచలనం సృష్టించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment