ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలిక ప్ర‌స‌వం

ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలిక ప్ర‌స‌వం

ఏలూరు జిల్లా చింత‌లపూడిలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. చింతలపూడి ప్రభుత్వ ఆస్ప‌త్రిలో 14 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఈ బాలిక, తల్లిదండ్రులకు తెలియకుండా ఆస్ప‌త్రిలో పాపకు జన్మనిచ్చింది. ఈ బాలిక తల్లి గృహిణి, తండ్రి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బాలికకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment