సినిమాల్లోకి జగ్గారెడ్డి? ఊహించని రోల్‌తో ఎంట్రీ!

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమాల్లో కనిపించనున్నారు. తనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందని ఆయన స్వయంగా వెల్లడించారు.

“ఇది ఒక లవ్ స్టోరీ. ఇందులో నాకు ప్రత్యేకమైన పాత్ర ఉంది. రాజకీయాల్లోనే కొనసాగుతాను, అయితే సినిమాల్లో కూడా కనిపిస్తాను. రాజకీయాల్లో నన్నెవరూ తొక్కలేరు. నా నిజమైన వ్యక్తిత్వాన్ని సినిమాలో చూడొచ్చు. ఈ ఉగాదికి కథ వింటా, వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తా” అని జగ్గారెడ్డి చెప్పారు.

అయితే, ఆయన ఏ సినిమాతో తెరపై కనిపించబోతున్నారు? ఏ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు? అనేక ప్రశ్నలు అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment