అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Women’s Day) పురస్కరించుకుని, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఆటగాళ్ల కుటుంబసభ్యులతో కూడిన ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌తో పాటు ఐపీఎల్‌లో మిగిలిన జట్ల అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మహిళా శక్తికి గౌరవంగా..
ఈ వీడియోలో అభిషేక్ శర్మ, మహ్మద్ షమీ, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, నితీశ్, జయ్ దేవ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ తదితరుల కుటుంబసభ్యుల చిత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. వారి జీవితాల్లో మహిళా శక్తి ఎంత ముఖ్యమో తెలియజేస్తూ, “మనకు స్ఫూర్తి, మద్దతు ఇచ్చే మహిళామణులందరికీ శుభాకాంక్షలు” అని SRH పేర్కొంది.
క్రీడా ప్రపంచంలో ప్లేయర్ల విజయాల వెనుక వారి కుటుంబ సభ్యుల, ముఖ్యంగా మహిళల సహాయ సహకారాలను గుర్తు చేసేలా ఈ వీడియో అభిమానుల్లో ప్రత్యేకంగా నిలిచింది.
For the ones who inspire, support & stand tall ✨
— SunRisers Hyderabad (@SunRisers) March 8, 2025
Wishing all the incredible women a Happy Women’s Day 🧡#PlayWithFire pic.twitter.com/7pwJPWtsIu