డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె.. వీడియో వైరల్

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె.. వీడియో వైరల్

అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె ఓ వ్యక్తిని చెప్పుతో కొడుతూ, తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుపడుతూ కనిపించడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన డిస్పూర్ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ వద్ద చోటుచేసుకుంది.

ఆగ్రహానికి కారణమేంటి?
సదరు వ్యక్తి మహంత దగ్గర డ్రైవర్‌గా పని చేస్తుండగా నిత్యం మద్యం తాగి తనతో దురుసుగా ప్రవర్తించేవాడని మహంత కుమార్తె ఆరోపించారు. అనేకసార్లు హెచ్చరించినా అతని ప్రవర్తన మారలేదని, సోమవారం పూర్తిగా మద్యం మత్తులో వచ్చి తన గది త‌లుపు తట్టాడని, అందుకే ఈ విధంగా బుద్ధి చెప్పానని ఆమె వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం మాత్రం అనుమానాలను తావిస్తోంది.

ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం గణ పరిషత్ (AGP) సహ వ్యవస్థాపకుడు. 1985-1990, 1996-2001 మధ్య రెండు ప‌ర్యాయాలు అస్సాం ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో, పార్టీతో విభేదాల కారణంగా ఆయన పోటీ చేయలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment