నరసరావుపేట పోలీసుల అదుపులో పోసాని

నరసరావుపేట పోలీసుల అదుపులో పోసాని

Summarize with AI

నటుడు, సినీ ర‌చ‌యిత‌ పోసాని కృష్ణమురళిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై పీటీ వారెంట్ ఇచ్చారు. రాజంపేట స‌బ్ జైల్ నుంచి పోసానిని న‌ర‌స‌రావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్ప‌గింత‌కు ముందు పోసాని కృష్ణ‌ముర‌ళికి వైద్య పరీక్షలు నిర్వహించారు. న‌ర‌స‌రావుపేట టూటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఆయనపై 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరే అవకాశం ఉంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను దూషించార‌నే అభియోగంతో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 15 కేసులు నమోదయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment