మా ‘ఛావా’ రుతురాజ్.. సీఎస్కే పోస్ట్ వైర‌ల్‌

మా ‘ఛావా’ రుతురాజ్.. సీఎస్కే పోస్ట్ వైర‌ల్‌

Summarize with AI

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు రుతురాజ్ గైక్వాడ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గతేడాది మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఆయన, జట్టుకు నూతన శక్తిని అందిస్తున్నారు. తాజాగా, సీఎస్కే తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది.

రుతురాజ్‌పై ప్రత్యేక పోస్ట్
ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్న ‘ఛావా’(Chhaava) మూవీలోని తుఫాన్ గీతాన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించి, రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) వీడియోను CSK పంచుకుంది. దీనికి “మా ‘ఛావా’.. మా కెప్టెన్!” అనే క్యాప్షన్ జోడించడం విశేషం. ఈ పోస్ట్ ప్రస్తుతం అభిమానుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. రుతురాజ్ కెప్టెన్సీలో సీఎస్కే ఈ సీజన్‌లో ఏ విధంగా రాణిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment