తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మిత్రుడు, యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) అకాల మృతిచెందారు. దుబాయ్‌లో ఉన్న కేదార్ అనూహ్యంగా తుదిశ్వాస విడిచారు. ఈ వార్త టాలీవుడ్‌లో తీవ్ర షాక్‌ను రేపింది.
ఇటీవల ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన గం గం గణేశా చిత్రానికి కేదార్ నిర్మాతగా వ్యవహరించారు. బన్నీ వాసుతో పాటు అల్లు అర్జున్‌కు కేదార్ అత్యంత సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్నారు. గతంలో ముత్తయ్య అనే సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా కేదార్ బ్యానర్‌లో నిర్మించాల్సి ఉంది.
కేదార్ మృతికి కారణాలు తెలియరాలేదు యంగ్ ప్రొడ్యూసర్ మృతి పట్ల అనుమానాలు నెలకొన్నాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయా?, దుబాయ్‌కు ఎందుకు వెళ్లారు? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయాలపై ఇంకా స్పష్టత రానుండగా, కేదార్ అకాల మృతి టాలీవుడ్‌కు తీరని లోటుగా మారింది.








