ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..? నేడు కీలక ప్రకటన

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..? నేడు కీలక ప్రకటన

ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు బీజేపీ హైకమాండ్ ఇవాళ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రేఖ గుప్తా ఎవరు?
బీజేపీ తరఫున షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేఖ గుప్తా విజయం సాధించారు. గతంలో జాతీయ కార్యదర్శిగా, బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా సేవలు అందించారు. కౌన్సిలర్‌గా, ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా అనుభవం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళా ముఖ్యమంత్రులు ఎవ‌రూ లేరు. అందువల్ల, ఢిల్లీలో మహిళా నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతలను సీఎంలుగా చేసిన అనుభవంతో, అదే వ్యూహాన్ని ఢిల్లీలో కూడా అనుసరించనుంది.

ఘ‌నంగా ప్రమాణస్వీకార వేడుక‌
ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో రేఖ గుప్తా ప్రమాణస్వీకారం గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు 50 మంది సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు హాజరయ్యే అవకాశముంది. కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నేతలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. బాబా రామ్‌దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి తదితర మతపెద్దలు కూడా హాజరవుతారని సమాచారం. అంతేకాదు, ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ సంగీత ప్రదర్శన కూడా ఇవ్వనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment