జేసీకి షాక్‌.. మాధవీలత ఫిర్యాదుతో కేసు నమోదు

జేసీకి షాక్‌.. మాధవీలత ఫిర్యాదుతో కేసు నమోదు

Summarize with AI

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) ఆయనపై కేసు నమోదు చేశారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, జేసీ అనుచరులు తనను చంపుతామని బెదిరింపులకు దిగారని మాధవీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధ‌వీల‌త ఫిర్యాదును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న పోలీసులు టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మాధవీలత, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి డిసెంబర్ 31న మహిళలకు మాత్రమే ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయడాన్ని మాధవీలత తప్పుబట్టారు. న‌టి మాధ‌వీల‌త‌ వ్యాఖ్యలపై జేసీ అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌డంతో వివాదం ముదిరింది. దీంతో మాధ‌వీల‌త పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

క్షమాపణలు చెప్పిన జేసీ.. కానీ వివాదం కొనసాగిందే
తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గి మాధవీలతకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. “ఆవేశంలో నోరు జారిపోయింది.. టంగ్ స్లిప్ అయింది.. సారీ” అంటూ వ్యాఖ్యానించారు. అయితే, జేసీ క్షమాపణ చెప్పినా మాధవీలత తన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుని వీడియో విడుదల చేశారు. ఈ వ్యవహారం మాధవీలత ఫిల్మ్ ఛాంబర్, మానవ హక్కుల సంఘంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ‘సినిమా వాళ్లను అవమానించడం కరెక్ట్ కాదు.. రాజకీయాల్లోకి వచ్చినా వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం సమంజసం కాదు’ అంటూ తన వాదనను ముందుకు తీసుకెళ్లారు.

Join WhatsApp

Join Now

Leave a Comment