ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేతులెత్తేసింది. ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఈ ఎన్నికల్లో ఆప్ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (LG) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సచివాయలం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదని అధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. పదేళ్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మద్యం స్కామ్లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలుకు వెళ్లొచ్చారు.
పదేళ్లలో జరిగిన ఆప్ చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని బీజేపీ క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. చేసిన అవినీతి ఆరోపణలు నిజమని నిరూపించేందుకు బీజేపీ సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఈ అంశం ఢిల్లీలో రాజకీయ వేడి పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు