ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అయిన తండేల్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు నాగచైతన్య-సాయిపల్లవి యాక్టింగ్ ప్లస్‌గా నిలిచింది. కాగా, ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమ చూసిన మత్స్యకార కుటుంబాలంతా పాకిస్తాన్‌లో చిక్కుకొని విడుదలైన తమ వారిని గుర్తుచేసుకుంటున్నారు.
సినిమా చూసిన అనంతరం మత్స్యకార కుటుంబానికి చెందిన ఓ మహిళ మీడియాతో మాట్లాడారు. `నా పేరు ముగతమ్మ, నా భర్త పేరు అప్పారావు. పిల్లలు కల్యాణ్, కిషోర్. సముద్రంలో చేపల వేటకు వెళ్లి నా ఫ్యామిలీలో ముగ్గురు పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయారు. నేను అప్పుడు కూలిపనికి వెళ్తే మా మూడు బోట్లు దొరికిపోయాయని ఫోన్ వచ్చింది. మా గ్రామ సర్పంచ్, నాయకులు మీడియాను తీసుకొని మా ఇంటికి వచ్చారు.
చంద్రబాబు ప్రభుత్వం ఉండగా మా వాళ్లు పాకిస్తాన్‌లో చిక్కుకుపోయారు. రాజాంలో పాదయాత్ర చేస్తున్న జగనన్నను కలిశాను. నా సమస్యను చెప్పాను. ఈ మూడు మాసాల్లో ఓపిక పట్టు మన ప్రభుత్వం వస్తుంది.. మీ మనుషులను తీసుకువస్తాం.. అని నా చేతిలో చెయ్యి వేసి చెప్పారు. చెప్పినట్టుగానే మమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. కేంద్రంతో మాట్లాడి.. మా కుటుంబంలోని వారిని రక్షించి తీసుకువచ్చింది మా తండేల్ జగనన్న. జగన్ మా గుండెల్లో ఉన్నాడు.
మా రియల్ హీరో జగన్..ఆయనే మా దేవుడు..తండేల్ సినిమాపై మత్స్యకారుల రియాక్షన్.!!@ysjagan @ThandelTheMovie #fishermen #Reaction #Thandel #thandelmovie #RTV pic.twitter.com/rrQmjIPWu6
— RTV (@RTVnewsnetwork) February 7, 2025
మా వాళ్లను తీసుకురావడమే కాకుండా రూ.5 లక్షల చొప్పున సాయం అందించారు. మా కుటుంబానికి రూ.15 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో నా కొడుకును గవర్నమెంట్ బోటు ఇప్పించాను. జగనన్న వల్లే అది సాధ్యమైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. ఇప్పటి వరకు మత్స్యకార భరోసా ఇవ్వలేదు. జగనన్న గెలిచిన వెంటనే మా వాళ్లను విడిపించి, మాకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. పార్లమెంట్ వరకు తీసుకెళ్లాడు. ప్రధానితో మాట్లాడి మా వాళ్లను తీసుకువచ్చిన జగన్ అన్నను ఎలా మరిచిపోతాం. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం“ అని ఆ మత్స్యకార మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.