‘తండేల్’ టీమ్‌ హంగామా.. చందూ, డీఎస్పీ స్టెప్పులు వైరల్

‘తండేల్’ టీమ్‌ హంగామా.. చందూ, డీఎస్పీ స్టెప్పులు వైరల్

నాగచైతన్య – సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ‘తండేల్’ (Thandel) సినిమా విడుదలకు సిద్ధమైంది. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇప్పటికే మూవీ ఫస్ట్ కాపీ రెడీ కాగా, స్టూడియోలో స్పెషల్ ప్రివ్యూలో చిత్రబృందం ఆస్వాదించింది. సినిమా చూసిన తర్వాత దర్శకుడు చందూ మొండేటి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కలిసి ‘హైలెస్సో’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. వారి ఎనర్జీ, ఉత్సాహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

DSP అందించిన మ్యూజిక్, చైతూ(Naga Chaitanya) – సాయి పల్లవి (Sai Pallavi) కెమిస్ట్రీ, చందూ మొండేటి టేకింగ్ కలసి ‘తండేల్’ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. మరి, ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment