మీర్‌పేట్ హ‌త్య‌కు.. ‘సూక్ష్మ‌ద‌ర్శిని’ సినిమానే స్ఫూర్తి!

మీర్‌పేట్ హ‌త్య‌కు.. 'సూక్ష్మ‌ద‌ర్శిని' సినిమానే స్ఫూర్తి!

హైదరాబాద్ (Hyderabad) మీర్‌పేట్ ప్రాంతంలో భార్య‌ను చంపి, ముక్క‌లు చేసి, ఉడికించిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భ‌ర్త గురుమూర్తి (Gurumurthy) భార్య‌ వెంక‌ట మాధవి (Venkata Madhavi) హత్యని అతికిరాత‌కంగా హ‌త్య చేశాడు. ఈ కేసు పోలీసుల‌కు సైతం స‌వాల్‌గా మారిన విష‌యం తెలిసిందే. కాగా, ఈ కేసు (Murder Case) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి, మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సూక్ష్మదర్శిని’ (Thriller Movie Influence) స్ఫూర్తితోనే తన భార్యను హత్య చేసినట్లు తెలుస్తోంది.

హత్యకు స్ఫూర్తి అందించిన సినిమా!
‘సూక్ష్మదర్శిని’ సినిమాలో ఒక కుటుంబంలోని కుమారుడు, తల్లిని హత్య చేస్తారు. ఈ హత్యను రహస్యంగా ఉంచేందుకు కెమికల్స్ ద్వారా మృతదేహాన్ని కరిగించి వాష్‌రూమ్ ఫ్లష్ ద్వారా తొలగిస్తారు. ఈ విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేసినట్లు గురుమూర్తి విచారణలో చెప్పినట్లు సమాచారం. అయితే, పోలీసులు పూర్తి వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ హత్య కేసు దర్యాప్తులో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రజలలో ఆందోళనకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment