ట్రంప్‌ కీలక నిర్ణయం.. ఫెడరల్ ఉద్యోగులకు షాక్‌?

ట్రంప్‌ కీలక నిర్ణయం.. ఫెడరల్ ఉద్యోగులకు షాక్‌?

అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. గత బైడెన్‌ ప్రభుత్వం అమలు చేసిన 78 ఆదేశాలను రద్దు చేయడంతో పాటు, కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫెడరల్‌ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ (DEI) సిబ్బందికి ఊహించని షాక్ తగిలింది. ట్రంప్‌ ప్రభుత్వం ఈ విభాగానికి సంబంధించిన ఉద్యోగులను సెలవులో పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఏం జరుగుతోంది?
అమెరికా ప్రభుత్వం సిబ్బంది నిర్వహణ కార్యాలయం విడుదల చేసిన మెమో ప్రకారం, జనవరి 22 సాయంత్రం 5 గంటల లోపు అన్ని డైవర్సిటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బందిని వేతనంతో కూడిన సెలవులోకి పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో పాటు DEI వెబ్‌సైట్లను తొలగించడం, అన్ని శిక్షణా కార్యక్రమాలను రద్దు చేయడం, ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను రద్దు చేయడం వంటి అంశాలు ఉన్నాయి.

ఫెడరల్ ఉద్యోగాలపై ప్రభావం?
ఈ నిర్ణయంతో వేలాది ఉద్యోగాలు రద్దుకావచ్చని అంచనా. కానీ, ఇప్పటివరకు ట్రంప్‌ ప్రభుత్వం నుండి దీని పూర్తి ప్రభావంపై క్లారిటీ రాలేదు. ఈ చర్యలతో ఫెడరల్‌ ఉద్యోగాల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం.

సీఎస్‌పీ అఫెక్ట్ – ఉద్యోగులకు భద్రత ఉందా?
ఈ చర్యల పట్ల ఉద్యోగుల్లో భయం నెలకొంది. అయితే, కొత్త అధ్యక్షుడి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే కొనసాగితే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment