లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కొత్త కెప్టెన్గా రిషభ్ పంత్ ఎంపికవ్వడం క్రికెట్ లోకంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా పంత్కు శుభాకాంక్షలు తెలియజేసి, అతని నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశాడు.
“రిషభ్ పంత్ కెప్టెన్గా జట్టును విజయవంతంగా నడిపిస్తాడు. అలాగే జట్టు యజమాని సంజీవ్ గోయెంకాతో అతని ఆలోచనల సమన్వయం చక్కగా ఉంటుంది. బౌలింగ్లో పెద్దగా సమస్యలు ఉండవు, కానీ బ్యాటింగ్ విషయంలో ఓపెనింగ్ గురించి తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి” అని చోప్రా అన్నారు.
LSG జట్టులో కొత్త శక్తి
రిషభ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడంతో జట్టు కొత్త శక్తిని పొందనుందని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు జట్టులో మార్పులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.