అమెరికాలో టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన ఈ పాపులర్ యాప్‌ను అమెరికా యాప్ స్టోర్ల నుంచి పూర్తిగా తొలగించారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో ఈ యాప్ నిషేధంలో ఉంది. ఈ నిషేధానికి అగ్రరాజ్యం పేర్కొన్న కారణం మరింత చర్చనీయాంశమైంది. టిక్‌టాక్ యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ అయిన ‘బైట్‌డాన్స్’ ద్వారా చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నిషేధం డేటా భద్రత మరియు ప్రైవసీపై దేశాల మధ్య తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
టిక్‌టాక్‌తో డేటా చౌర్యం.. అమెరికా కీలక నిర్ణయం








