నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సేవలు అందించే పథకం, గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల నిర్వహణ, గీత కులవృత్తిదారులకు 10% మద్యం షాపుల కేటాయింపులు, పరిశ్రమలకు భూమి కేటాయింపులు వంటి అనేక కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

మహిళలకు మరింత ప్రయోజనాలను అందించేందుకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించాలని కేబినెట్ చర్చించనుంది. గీత కులవృత్తిదారులకు 10% మ‌ద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు భూమి కేటాయింపు పై చర్చ జరుగనుంది. మంత్రిమండ‌లి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment