వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్ పర్యటనకు బయల్దేరివెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్ కాలేజీ లండన్‌లో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సును పూర్తిచేసి, డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 16న కింగ్స్‌కాలేజ్ లండన్‌లో గ్రాడ్యుయేషన్ డే జరగనుంది. ఈ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొంటారు. ఈ నెలాఖరున జగన్ లండన్ నుంచి తిరుగు ప్రయాణం అవుతారని వైసీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
News Wire
-
01
700 దాటిన మృతుల సంఖ్య
నేపాల్ వరదల్లో 700 దాటిన మృతుల సంఖ్య, 5,851 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. 2,426 మంది గల్లంతు అయినట్టు వెల్లడి
-
02
ఆకాశమే హద్దుగా నిత్యావసరాలు
ఏపీలో సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసర ధరలు. భారీగా పెరిగిన బియ్యం ధరలపై ప్రజల ఆందోళన. శ్రద్ధ చూపని సర్కార్
-
03
రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ
సీఎం రేవంత్ కోసం ప్రత్యేకంగా గోల్డ్ రాఖీ చేపించి కట్టిన మంత్రి సురేఖ. సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టిన కొండా సురేఖ
-
04
నేపాల్‌కు మరో జల ప్రళయం
రెండ్రోజుల క్రితం వచ్చిన వరదల కంటే 5 రెట్లు అధికంగా వచ్చే ప్రమాదం. పోలీసుల హెచ్చరికలతో నేపాల్ వాసుల పరుగులు
-
05
ఏపీ టీచర్‌పై కత్తితో దాడి
గుంతకల్లు రాజేంద్రనగర్‌లో శ్రీచైతన్య స్కూల్లో పనిచేస్తున్న టీచర్‌పై కత్తితో దాడి చేసిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్. పరిస్థితి విషమం
-
06
జగ్గీ వాసుదేవ్ కన్నీరు
నేపాల్ జలప్రళయంలో 300 మంది భారతీయులు గల్లంతు. ఇషా ఫౌండేషన్ సభ్యులు 77 మంది గల్లంతు. జగ్గీ వాసుదేవ్ కన్నీరు.
-
07
అడ్వకేట్లకు రూ.82 లక్షల ఫీజు
ఏపీ మద్యం కేసులో అడ్వకేట్లకు రూ.82 లక్షలు. ఫీజుల రూపంలో ముకుల్ రోహత్గికి రూ.80 లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
-
08
నేపాల్ వరదల్లో ఏపీ వాసులు
వరదల్లో ముగ్గురు గల్లంతు, వరదలు చిక్కుకున్న మరో నలుగురు. గైరంగ్ ఎంబసీ వద్ద మిస్ అయినట్లు వెల్లడించిన ఏపీ ప్రభుత్వం
-
09
ఏపీలో లొంగిపోయిన మావోయిస్టులు
పోలవరం ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోలు. హిడ్మా ప్రధాన అనుచరురాలు ముచ్చిక మంగి సహా మరో ఇద్దరు లొంగుబాటు
-
10
భారతీయుల కోసం టోల్ ఫ్రీ నంబర్
నేపాల్‌లో గల్లంతు అయిన భారతీయుల కోసం ఎమర్జెన్సీ నెంబర్లు. +977 985 131 6807, +977 970 910 7500








