---Advertisement---

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు? – క‌న్న‌బాబు ప్ర‌శ్న‌

టీటీడీ స‌మీక్షకు ప్రైవేట్ వ్య‌క్తులు ఎందుకొచ్చారు..? - క‌న్న‌బాబు ప్ర‌శ్న‌
---Advertisement---

సంక్రాంతి పండుగ వేళ కూట‌మి ప్ర‌భుత్వం ప్రజలకు సంతోషాన్ని దూరం చేసింద‌ని, నిరుపేద‌ల‌కు నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సంక్షేమ పథకాల అమలుకు నోచుకోక‌పోవ‌డం పేదలపై కూట‌మి ప్రభుత్వం చూపిన చిన్న‌చూపుకు నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. సంక్రాంతి సంబ‌రాలు కూటమి పార్టీల్లోని పెద్దలకే సంక్రాంతి పరిమితమ‌య్యాయ‌న్నారు. కాకినాడ‌లో మాజీ మంత్రి క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడారు.

సంక్షేమం ఆగిపోతే పండుగకు రంగు లేకుండా పోయింది
వైసీపీ హయాంలో ప్ర‌తి ఏడాది సంక్రాంతి సందర్భంగా పేదల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవ‌ని, ఆ న‌గ‌దు సాయం పండుగ వేళ ఆ పేద‌ల కుటుంబానికి ఎంతో ఆస‌రాగా నిలిచేవ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తి విఫలమైందని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు పండుగకు కొత్త దుస్తులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. వ‌

భక్తుల వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు?
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో తప్పుడు ప్రచారం చేశారని, జగన్ పై బుదరచల్లేందుకు కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారంను చూసి మొత్తం దేశం అంతా కూడా ఛీ కొట్టింద‌న్నారు. తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసేలా కూట‌మి చేసే దుర్మార్గాల వల్ల ఇటువంటి పరిణామాలే ఎదురవుతాయని చుర‌క‌లు అంటించారు. ఆలయాలకు వెళ్తున్న‌ భక్తుల ఫోన్ నెంబర్లను ఎందుకు సేక‌రిస్తున్నారని క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు. ఫోన్ నెంబర్లను ఆర్టీజీఎస్ కు పంపి, వివరాలను నమోదు చేస్తున్నారన్నారు.

టీటీడీ మీటింగ్‌లో ప్రైవేట్ వ్య‌క్తులు?
టీటీడీ సమీక్షా సమావేశాల్లో ప్రైవేటు వ్యక్తులు కూర్చుంటున్నారని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను టీటీడీలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. అలాంటప్పుడు దేశంలోనే పేరున్న ప్రముఖ ఐటీ కంపెనీలు ఉన్నాయి. శ్రీవారికి ఉచితంగా సేవలు అందించేందుకు అనేక సంస్థలు సిద్దంగా ఉన్నాయి. వాటిని ఎందుకు పిలవలేదని ప్ర‌శ్నించారు. గతంలో మీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్న వారిని తీసుకువచ్చి టీటీడీ సమీక్షా సమావేశాల్లో కూర్చోబెట్టారని క‌న్న‌బాబు ఆరోపించారు. ఏ నోటిఫికేషన్ ద్వారా వారిని నియమించారు, ఈ సమావేశాల్లోకి ఎలా అనుమతించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పెద్దలు దీనిపై స్పందించాల‌న్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment