సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ ఓ వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన మార్పులను గమనిస్తే ఓ సెల్ఫీ దిగి పోస్టు చేయండి అంటూ ఎక్స్ వేదికగా తొలి సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను వైసీపీ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఓ కామన్ డీపీని కూడా జత చేసింది. 2019-24 ఐదేళ్ల వైసీపీ పాలనలో మారిన బతుకులు, గ్రామాల్లో కనిపిస్తున్న మార్పులను గమనించి ఓ సెల్ఫీ దిగి ఫొటో షేర్ చేయాలని కోరింది.
Here’s the CDP of @YSRCParty ’s First Social Media Campaign for 2025!
— YSR Congress Party (@YSRCParty) January 10, 2025
.@ysjagan గారి విజన్‌తో ఐదేళ్లలోనే మన ఊరిలోని బడి మారింది.. రైతుల బతుకులు మారాయి.. మహిళలకి గౌరవం పెరిగింది.. మొత్తంగా ఊరి బతుకు చిత్రమే మారిపోయింది.
మేనిఫెస్టోలో చెప్పినట్లు 99% హామీలను అమలు చేసి.. స్కూల్… pic.twitter.com/gUTqe64Nw6
వైఎస్ జగన్ విజన్‌తో ఐదేళ్ల పరిపాలనలో గ్రామాల్లోని ఊరిలోని బడి మారింది.. రైతుల బతుకులు మారాయి.. మహిళలకి గౌరవం పెరిగింది.. మొత్తంగా ఊరి బతుకు చిత్రమే మారిపోయింది. మేనిఫెస్టోలో చెప్పినట్లు 99 శాతం హామీలను అమలు చేసి.. స్కూల్ రూపురేఖలు మార్చి, ఆర్బీకేలను తెచ్చి, హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి, సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని మన కళ్ల ముందుకు తెచ్చిన జగనన్న ప్రతి గ్రామంలోనూ తన మార్క్‌ని క్రియేట్ చేశారని వైసీపీ తన ట్వీట్‌లో పేర్కొంది.
సంక్రాంతికి ఊరు వెళ్లిన సమయంలో చూస్తే ఇప్పటికీ జగనన్న మార్క్ గ్రామంలో స్పష్టంగా కనబడుతుంది. జిల్లాలో మెడికల్ కాలేజీ, కంపెనీస్, పోర్టులు ఇలా జగనన్న తీసుకొచ్చిన ఆ మార్పుని ఆస్వాదిస్తూ ఓ సెల్ఫీ దిగి #YSJaganMark హ్యాష్ టాగ్‌తో అందరం షేర్ చేద్దాం అని వైసీపీ పిలుపునిచ్చింది.







