పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాల నేపథ్యంలో రంపచోడవరం టీడీపీలో(TDP) అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రంపచోడవరం (Rampachodavaram) గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తన కుమార్తె దుర్గ(Durga) ఓటమిపై మనస్తాపానికి గురైన మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు(Seethamsetti Venkateswara Rao).. స్థానిక ఎమ్మెల్యే, ఆమె భర్త వ్యవహారశైలిపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్‌కు (Nara Lokesh) ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
పార్టీ అధిష్ఠానం ఆశీస్సులు తమకు ఉన్నాయంటూ ప్రచారం చేస్తూ క్యాడర్లో(Party Cadre) గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రంపచోడవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన కుమార్తెకు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించినప్పటికీ, స్థానిక నాయకత్వం రెబల్ అభ్యర్థిని బరిలో నిలిపి ప్రోత్సహించిందని వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు.
జడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ(MPTC) ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన తనకు పంచాయతీ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం నుంచి కనీస మద్దతు లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టడంతో పాటు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే, ఆమె భర్త వ్యవహారశైలిపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని నారా లోకేష్‌ను మాజీ ఎమ్మెల్యే కోరారు. పోలవరం జిల్లాలో(Polavaram District) పార్టీ పరిస్థితిపై సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు రక్షణ, గౌరవం, తగిన గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సొంత పార్టీ నాయకత్వంపైనే మాజీ ఎమ్మెల్యే అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం రంపచోడవరం టీడీపీలో(TDP)చర్చనీయాంశంగా మారింది.








