ఏపీలో పంచాయతీ ఎన్నికల తుది అంకానికి నోటిఫికేషన్..

ఏపీలో పంచాయతీ ఎన్నికల తుది అంకానికి నోటిఫికేషన్..

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది (Panchayat Election Process) దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు దశలకు సంబంధించిన నోటిఫికేషన్లు (Notifications) విడుదల కాగా, తొలి దశలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తై తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రెండో దశలో నామినేషన్ల స్వీకరణ (Nomination Filing) ప్రారంభమైంది. తాజాగా తుది దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు.

ఈ దశలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎల్లుండి నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుండగా, ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీళ్లు (Appeals) దాఖలు చేసేందుకు 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. వాటిని 26వ తేదీన పరిష్కరించనున్నారు.

అనంతరం అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఇక డిసెంబర్ 2వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు (Election Results) ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు. అనివార్య కారణాలతో ఎక్కడైనా రీపోలింగ్ (Repolling) నిర్వహించాల్సి వస్తే డిసెంబర్ 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment