సంక్రాంతి ముందు షాక్‌.. KF బీర్ల సరఫరా నిలిపివేత

సంక్రాంతి ముందు షాక్‌.. KF బీర్ల సరఫరా నిలిపివేత

Summarize with AI

ఇది తెలంగాణ మద్యం ప్రియులకు చాలా నిరాశపరిచే వార్త. యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ (UBL) ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్లు, హీనెకెన్ బీర్ల సరఫరాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 నుండి ధరలను సవరించకపోవడం, బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థకు నష్టం వాటిల్లిందని కంపెనీ వెల్లడించింది.

ఎందుకంటే భారీ నష్టం?
యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ సంస్థ కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు నిలిపివేసింది. బీసీఎల్ బకాయిలు, ధరల సవరణలు లేకపోవడంతో వారికి భారీ నష్టం వచ్చిందని సంస్థ పేర్కొంది. ఈ నిర్ణయంతో సంక్రాంతి పండగకు ముందు తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టేనా అన్న సందేహం మొదలైంది. మ‌రి ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మద్యం వ్యాపారం రాష్ట్రానికి ముఖ్యమైన ఆదాయ మార్గం కావడంతో, ఈ పరిణామాలు రాజకీయంగా కూడా కాస్త ఇబ్బందిక‌రంగా మారే ప్ర‌మాదం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment