సమ్మక్క సాగర్‌ ఎన్‌ఓసీపై రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ!

సమ్మక్క సాగర్‌ ఎన్‌ఓసీపై రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ!

Summarize with AI

తెలంగాణలోని సమ్మక్క సాగర్ బ్యారేజీకి (Sammakka Sagar Barrage) అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) త్వరగా జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని(Vishnu Deo Sai) కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో(Uttam Kumar Reddy) కలిసి ఆయన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఎల్‌నినో(El Niño) పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో నీటి అవసరాలు (Water Requirements) పెరిగే అవకాశం ఉందని వివరించిన రేవంత్ రెడ్డి.. బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, మిగిలిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఛత్తీస్‌గఢ్ సీఎం.. ఎన్‌ఓసీ (NOC) ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ములుగు జిల్లా తుపాకులగూడెం (Tupakulagudem) వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద ఈ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఛత్తీస్‌గఢ్‌లో ముంపు ప్రభావంపై ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. భూసేకరణ(Land Acquisition), పరిహారం(Compensation, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్‌ఓసీతో పాటు మిగిలిన అనుమతులు లభిస్తే బ్యారేజీని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment