మెగా వేడుకలకు అకీరా, ఆద్య హాజరుపై రేణు దేశాయ్ క్లారిటీ!

మెగా వేడుకలకు అకీరా, ఆద్య హాజరుపై రేణు దేశాయ్ క్లారిటీ!

Summarize with AI

మెగా కుటుంబంలో(Mega Family) జరిగే శుభకార్యాలు, వేడుకల్లో అకీరా నందన్(Akira Nandan), ఆద్య(Aadhya) తరచూ కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అయితే, వాళ్లు ఆ ఫంక్షన్లకు వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణంపై నటి రేణు దేశాయ్ (Renu Desai) తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పిల్లలు మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌కు (Mega Family Events) వెళ్లడం వెనుక తన పెంపకం, సంస్కారమే కారణమని స్పష్టం చేశారు. “పిల్లలకు కుటుంబ విలువలు, పెద్దలను గౌరవించడం, అబద్ధాలు చెప్పకపోవడం వంటివి చిన్నప్పటి నుంచే నేర్పించాను. మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌కు వాళ్లు వెళ్లడం వెనుక ఉన్నది నా సంస్కారమే. తల్లిగా నా కర్తవ్యాన్ని నేను బాధ్యతతో నిర్వర్తిస్తున్నాను” అని తెలిపారు.

అదే సమయంలో సమాజం ఆలోచనా ధోరణిపై ఆమె నిర్మొహమాటంగా స్పందించారు. “మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు (Mega Family Functions) పిల్లలు వెళ్లినప్పుడు అక్కడ నేను ఉండను. నా సమక్షంలో ఉంటే వాళ్లు ఏదైనా పొరపాటు చేసినా వెంటనే గమనించి సరిదిద్దుతాను. కానీ నేను లేనిచోట, పదిమందిలో ఉన్నప్పుడు వాళ్లు ఏ చిన్న తప్పు చేసినా జనాలు క్షణాల్లో తీర్పు ఇచ్చేస్తారు.. ‘చూశారా, తల్లి పెంపకంలోనే లోపం ఉంది’ అంటూ నింద మొత్తం నా మీదే వేస్తారు. పిల్లలు మంచి చేస్తే క్రెడిట్ ఇవ్వకపోయినా, లోపం జరిగితే మాత్రం తల్లిపైనే బురదజల్లే మనస్తత్వం ఈ సమాజంలో ఉంది” అని పేర్కొన్నారు. అందుకే తన పెంపకాన్ని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అకీరా(Akira), ఆద్యలను(Aadhya) మొదటి నుంచీ క్రమశిక్షణతో పెంచుతున్నట్లు ఆమె వివరించారు. మెగా ఈవెంట్స్‌కు పిల్లలు హాజరుకావడంపై రేణు దేశాయ్(Renu Desai) ఇచ్చిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment