హైదరాబాద్ పాతబస్తీలో యువకుడి దారుణ హత్య..

హైదరాబాద్ పాతబస్తీలో యువకుడి దారుణ హత్య..

Summarize with AI

హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలోని(Old City) కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో(Kanchanbagh Police Station) దారుణ హత్య చోటుచేసుకుంది. హఫీజ్ బాబా నగర్‌లో(Hafeez Baba Nagar) మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సయ్యద్ ఒమర్ (Syed Omar) అలియాస్ మషల్లా ఒమర్ (Mashalla Omar) అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఒమర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన సయ్యద్ (Syed) అనే మరో వ్యక్తిపైనా దుండగులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ హత్యకు అమన్ ఖురేషి(Aman Qureshi), అలీ భైసా (Ali Baisa) అనే వ్యక్తులు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడు ఒమర్‌కు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మద్యం(Alcohol), గంజాయి (Marijuana)మత్తులో కొందరితో కలిసి గ్యాంగ్‌గా(Gang) ఏర్పడి స్థానికులను బెదిరించడం, దాడులకు పాల్పడటం, డబ్బులు వసూలు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత కక్షలే హత్యకు కారణమా? లేక గ్యాంగ్‌ల మధ్య ఘర్షణతో ఈ ఘటన జరిగిందా? అనే కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ (Clues Team) సహాయంతో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ హత్యకు గల కారణాలు, నిందితుల ఆచూకీపై దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment