ఒంగోలు సమీపంలో తీరం దాటిన ‘మురసు’ తీవ్ర తుపాను

ఒంగోలు సమీపంలో తీరం దాటిన ‘మురసు’ తీవ్ర తుపాను

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) తీరాన్ని ‘మురసు’(Murasu) తీవ్ర తుపాను ముంచెత్తింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో మురసు తీవ్ర తుపానుగా మంగళవారం తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు (Strong Gusty Winds) వీచడంతో తీర ప్రాంతాలు విలవిలలాడాయి.

గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తుపాను, ప్రస్తుతం ఒంగోలుకు 20 కి.మీ, బాపట్లకు 60 కి.మీ, కావలికి 70 కి.మీ, నెల్లూరుకు 110 కి.మీ, మచిలీపట్నంకు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Authority) వెల్లడించింది.

తుపాను తీరం దాటిన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy to Very Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ Meteorological Department) హెచ్చరించింది.

భారీ వర్షాలు పడే జిల్లాలు: పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడికక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు (Fishermen) వేటకు వెళ్లవద్దని, తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు.

తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు, క్షేత్రస్థాయి యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) మేనేజింగ్ డైరెక్టర్, RTGS సీఈఓ ప్రఖర్ జైన్ ఆదేశించారు.

భారీ గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వర్షం తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. బాధిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అత్యవసర సహాయం కోసం నియంత్రణ గదులను ఆశ్రయించాలని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment