ఓటు వేయకుండానే వెనుదిరిగిన వైఎస్ జగన్

ఓటు వేయకుండానే వెనుదిరిగిన వైఎస్ జగన్

Summarize with AI

పులివెందులలో(Pulivendula) ఈరోజు మున్సిపల్‌ ఎన్నికల్లో(Municipal Elections) భాగంగా చోటు చేసుకున్న దారుణాలపై వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) చేస్తున్న అరాచకం చూస్తుంటే ఓటు వేసే పరిస్థితులు లేవన్నారు వైఎస్‌ జగన్‌. చంద్రబాబుతో(Chandrababu) కుమ్మక్కైన ఎస్‌ఈసీ (SEC)ప్రజా స్వామ్యాన్ని(Democracy) అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే పులివెందులలో వైఎస్‌ జగన్‌ ఓటు (Vote) వేయకుండానే వెనుదిరిగారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ పై, అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘నేను ఓటు వేయను.. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులు ప్రజలకు (People) తెలియాలి. ఓటేస్తే అంతా సవ్యంగా ఉందనే భ్రమ కలుగుతుంది, కానీ ఇక్కడ ఓటు (People) వేసే పరిస్థితులు ఏమాత్రం లేవు. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సహా అధికారులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) చేతిలో తోలుబొమ్మలుగా మారారు.

ఇక్కడ రీపోలింగ్‌ (Repolling) పెడితే అప్పుడొచ్చి ఓటేస్తా. టీడీపీ (TDP) అరాచకాలపై న్యాయపోరాటం చేస్తాం, కోర్టుకు వెళతాం. ప్రజా స్వామ్యాన్ని (Democracy) కాపాడుకోకపోతే ఈరోజు మీ ఓటు పోతుంది.. రేపు మీ ఆస్తులే(Properties) పోతాయి’అంటూ వైఎస్‌ జగన్‌ ఓటర్లను అప్రమత్తం చేశారు.

అంతకుముందు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో రీపోలింగ్‌ నిర్వహించేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్వో కార్యాలయం (RO Office)ఎదుట వైఎస్ జగన్‌ బైఠాయించారు. తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదని ఆరోపించారు. అప్పటికే ఫిర్యాదు చేసేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్న ఏజెంట్లు కింద బైఠాయించి నిరసన తెలుపుతుండగా వైఎస్‌ జగన్ కూడా వారితోపాటు కూర్చొని నిరసన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment