పులివెందులలో టీడీపీ విధ్వంసకాండ.. దాడులు, దౌర్జన్యాలతో దద్దరిల్లిన పట్టణం!

పులివెందులలో టీడీపీ విధ్వంసకాండ.. దాడులు, దౌర్జన్యాలతో దద్దరిల్లిన పట్టణం!

Summarize with AI

వైఎస్సార్ కడప (YSR Kadapa) జిల్లా పులివెందులలో(Pulivendula) టీడీపీ గూండాలు (TDP Goons) విధ్వంసం సృష్టిస్తున్నారు. ఓటర్లను టీడీపీ (TDP) మూకలు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. చివరకు టీడీపీ అరాచకాలను కవర్‌ చేస్తున్న నేషనల్ మీడియా పై కూడా టీడీపీ రౌడీలు (TDP Rowdies) దాడి చేశారు. జాతీయ మీడియా ఇండియా టుడే (India Today) కెమెరాను ధ్వంసం చేశారు. పులివెందుల 11, 12 బూత్‌ల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై (YSRCP Agents) టీడీపీ గూండాలు రాళ్లు విసురుతున్నారు. బూత్‌లకు ఎవరూ రాకుండా పచ్చమూకలు అడ్డుకుంటున్నారు.

పులివెందులలో స్వైర విహారం చేస్తున్న టీడీపీ గూండాలు.. పోలింగ్‌ బూత్‌లను(Polling Booths) ఆక్రమిస్తున్నారు. ఓటర్లు రాకుండా రాళ్ల దాడులు (Stone Attacks) చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పచ్చమూకలు ఖూనీ చేస్తున్నారు. టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో పులివెందుల బాయ్స్ జూనియర్‌ కాలేజీ (Pulivendula Boys Junior College) వద్ద ఓటర్లు నిరసనకు దిగారు. పోలింగ్‌ బూత్‌ (Polling Booth) వద్ద 400 మంది ఓటర్లు బైఠాయించారు.

తమ ఓట్లు టీడీపీ నేతలే వేస్తున్నారని ఓటర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓటర్లపై డీఎస్పీ మురళీ నాయక్‌ (Murali Naik) బెదిరింపులకు దిగారు. వెళ్లిపోండి.. ఓట్లు వేయొద్దు అంటూ బెదిరించిన డీఎస్పీ(DSP).. మీకు ఓటు వేసే హక్కు లేదంటూ ఓటర్లకు డీఎస్పీ వార్నింగ్‌ ఇచ్చారు. ఓటర్లకు రక్షణ కల్పించకుండా పోలీసులు వెనక్కి పంపుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment