తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్‌ను పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. అదనంగా ఎప్ట్రీ డైరెక్టర్ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్‌ను విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏ. వాణి ప్రసాద్‌కు క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నవీన్ మిట్టల్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రధాన కార్యదర్శిగా శైలజ రామయ్యర్‌ను నియమించారు. రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా డాక్టర్ కె. ఇలంబరితిని నియమించడంతో పాటు, రవాణా కమిషనర్ బాధ్యతలను కూడా కేటాయించారు.
హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు హెచ్ఎండీఏ పరిధిలోని పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి బాధ్యతలతో పాటు, జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శృతి ఓజాను నియమించారు.
తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) సీఎండీగా ఉన్న ముషారఫ్ అలీ ఫరూఖీని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. అదే సమయంలో ఆయనకు TGRPDCL సీఎండీ బాధ్యతలను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఎస్. సంగీత సత్యనారాయణను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా ఉన్న జితేష్ వి. పాటిల్‌కు తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.








