“దమ్ముంటే ఎన్నికలకు రండి..” – చంద్రబాబుకు జగన్ స‌వాల్

"దమ్ముంటే ఎన్నికలకు రండి.." - చంద్రబాబుకు జగన్ స‌వాల్

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) పేరుతో కూటమి ప్రభుత్వం (Coalition Government) సాగిస్తున్న అరాచకాలు(Atrocities), ప్రజాస్వామ్య ఖూనీపై(Murder of Democracy) వైయస్‌ఆర్‌సీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు (Supreme Court) మొట్టికాయలు వేసినా చంద్రబాబు ప్రభుత్వ(Chandrababu Government) తీరులో మార్పు రాలేదని, నామినేషన్లను అడ్డుకుంటూ ఏకగ్రీవాల పేరుతో గూండా రాజ్యాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై పక్కా ఆధారాలు, వీడియోలతో సహా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వ తీరును ధర్మాసనం తప్పుబట్టిందని గుర్తుచేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పోలీసులను(Police) అడ్డంపెట్టుకుని వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్ (Chandrababu And Gang) రాష్ట్రాన్ని రావ‌ణ‌కాష్టంగా మార్చేందుకు అష్ట‌కుట్ర‌ల‌కు తెర‌తీసింద‌ని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు. వీటి ద్వారా ప్ర‌తిప‌క్ష వైసీపీ శ్రేణుల‌పై దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతుంద‌ని మండిప‌డ్డారు.

  • పోలీసుల ద్వారా బెదిరింపులు, బైండోవర్లు, ముందస్తు అరెస్టులు.
  • నామినేషన్లకు వెళ్లకుండా నాయకుల గృహనిర్బంధాలు.
  • కేంద్రాల వద్ద రౌడీ మూకల మోహరింపు, భౌతిక అడ్డుకట్ట.
  • రిటర్నింగ్ అధికారుల ఎదుటే నామినేషన్ పత్రాల చించివేత.
  • దాడులను ఆపకుండా బాధితులనే బయటకు పంపడం.
  • బాధితులపైనే అక్రమ కేసులు బనాయించడం.
  • స్క్రూటినీ పేరుతో నామినేషన్ల తిరస్కరణ, ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణలు చూపడం.
  • ప్రాణభయంతో బలవంతంగా విత్‌డ్రాయల్స్ చేయించడం.

చిలకలూరిపేటలో(Chilakaluripet) అభ్య‌ర్థిపై దౌర్జన్యం చేయడం, కనిగిరిలో మహిళా అభ్యర్థి పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నా కనికరించకపోవడం, ధర్మవరం, పుంగనూరులో మహిళా అభ్యర్థులపై భౌతిక దాడులు జరగడం రాక్షస పాలనకు నిదర్శనమన్నారు.

ఒకవైపు అసలైన అభ్యర్థులను అడ్డుకుంటూనే, మరోవైపు వైసీపీ పేరుతో నకిలీ నామినేషన్లు వేయిస్తూ ఎన్నికలు సజావుగా సాగుతున్నట్లు ఎన్నికల కమిషన్‌కు తప్పుడు గణాంకాలు చూపుతున్నారని మండిపడ్డారు.

“ప్రజలకు మంచి చేసి ఉంటే ఆ మంచిని చూపించి ఓట్లు అడగండి.. నామినేషన్లను అడ్డుకుని దౌర్జన్యంతో గెలవాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. దమ్ముంటే వైసీపీ అభ్యర్థులందరికీ నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వండి” అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈ అరాచకాలన్నింటిపై న్యాయపోరాటం కొనసాగిస్తామని, బాధితులకు పార్టీ అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment