భారత్ ఓటమి.. బౌలర్లపై హర్మన్‌ప్రీత్ అసంతృప్తి!

భారత్ ఓటమి.. బౌలర్లపై హర్మన్‌ప్రీత్ అసంతృప్తి!

Summarize with AI

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది.

భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ 15 బంతుల్లో 31 పరుగులతో మెరుపు ఆరంభాన్ని అందించగా, దీప్తి శర్మ 29, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 24 పరుగులు చేశారు. అయితే భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ మారిజాన్‌ కాప్‌ 45 బంతుల్లో అజేయంగా 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో శ్రీ చరణి మూడు వికెట్లు తీయగా, షెఫాలీ వర్మ ఒక వికెట్‌ పడగొట్టింది. మిగతా బౌలర్ల నుంచి తగిన సహకారం లభించకపోవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. కీలక సమయాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపింది. శ్రీ చరణి, షెఫాలీ వర్మ బంతితో మంచి ప్రదర్శన చేసినప్పటికీ, మిగతా బౌలర్ల నుంచి మరింత సహకారం అవసరమని ఆమె అభిప్రాయపడింది. ఈ ఓటమితో నిరాశ చెందకుండా, మిగిలిన రెండు లీగ్‌ మ్యాచ్‌లపై దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది. కీలక సమయాల్లో మెరుగ్గా రాణిస్తూ, సమష్టి ప్రదర్శనతో తిరిగి విజయాల బాట పట్టడమే తమ లక్ష్యమని హర్మన్‌ప్రీత్‌ పేర్కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment