మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల..

Summarize with AI

మహిళల క్రికెట్‌లో యువ ప్రతిభకు అంతర్జాతీయ వేదిక సిద్ధమైంది. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. బంగ్లాదేశ్, నేపాల్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. మొత్తం 16 జట్లు పాల్గొనే ఈ మూడో ఎడిషన్‌లో 41 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 22న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.

నాలుగు గ్రూపుల్లో 16 జట్లు

టోర్నీలో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-Aలో భారత్, ఐర్లాండ్, వెస్టిండీస్, నేపాల్ ఉండగా.. గ్రూప్‌-Bలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, సమోవా ఉన్నాయి. గ్రూప్‌-Cలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నైజీరియా, యూఏఈ.. గ్రూప్‌-Dలో ఇంగ్లండ్, శ్రీలంక, అమెరికా, స్కాట్లాండ్ చోటు దక్కించుకున్నాయి. భారత్, పాకిస్థాన్ వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. ఆతిథ్య దేశమైన నేపాల్ కూడా భారత్ గ్రూపులో ఉండటంతో ఈ గ్రూప్‌లో ఆసక్తికర పోటీలు జరగనున్నాయి.

నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు.. ఫిబ్రవరి 6న ఫైనల్

బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్, సిల్హెట్‌తో పాటు నేపాల్ రాజధాని ఖాట్మండులోని నాలుగు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 21న టోర్నీ ప్రారంభమవుతుంది. జనవరి 26 వరకు గ్రూప్ దశ పోటీలు కొనసాగుతాయి. అనంతరం అర్హత సాధించిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. ఈ దశలో రెండు గ్రూపులుగా పోటీలు నిర్వహించి, ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 4న సెమీఫైనల్స్, ఫిబ్రవరి 5న రిజర్వ్ డే, ఫిబ్రవరి 6న ఫైనల్ నిర్వహించనున్నారు. ఫైనల్‌కు ఫిబ్రవరి 7ను రిజర్వ్ డేగా కేటాయించారు. భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment