జ‌గ‌న్ కేసులో టీడీపీ మీడియా అత్యుత్సాహం

జ‌గ‌న్ కేసులో టీడీపీ మీడియా అత్యుత్సాహం

Summarize with AI

వైసీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని (YS Jagan Mohan Reddy) లక్ష్యంగా చేసుకుని టీడీపీ(TDP) అనుకూల మీడియా మరోసారి తన వక్రీకరణ రాతలకు తెరలేపింది. ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకపోయినా, కోర్టులో జరుగుతున్న వాస్తవాలను పూర్తిగా పక్కదారి పట్టిస్తూ జగన్ వ్యక్తిగత హాజరుపై ఎల్లో మీడియా (Yellow Media) దుష్ప్రచారానికి పాల్పడడంపై వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

రాజకీయంగా ఎదుర్కొలేక, ఇలాంటి తప్పుడు వార్తల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు చంద్రబాబు (Nara Chandrababu Naidu) కూటమి రకరకాల కుట్రలు పన్నుతోందనే విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.

వైఎస్ఆర్ (Y. S. Rajasekhara Reddy) మ‌ర‌ణం త‌రువాత‌ జగన్‌పై నమోదైన అక్ర‌మ‌ కేసులకు సంబంధించి ఇప్పటికే సీబీఐ కోర్టులో (CBI Court) రోజువారీ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసులను త్వరగా తేల్చాలని తామే కోరుకుంటున్నామని వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు గతంలోనూ స్పష్టం చేశారు.

ఇప్పటికే రోజువారీ విచారణ జరుగుతున్నప్పటికీ, ఈడీ మరోసారి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ విచారణకు కూడా రానటువంటి తరుణంలో, దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ అనుకూల మీడియా తన పైత్యానికి పదునుపెట్టిందని వైసీపీ మండిప‌డుతోంది.

నిన్న ఈ అంశాన్ని సీబీఐ కోర్టు దృష్టికి జగన్ తరఫు న్యాయవాదులు తీసుకెళ్లగా.. ఇప్పటికే విచారణ జరుగుతున్న విషయాన్ని వారు గుర్తుచేశారు. దీనిపై స్పందించిన సీబీఐ కోర్టు.. ఈడీ, సీబీఐ చార్జిషీట్లపై విచారణ జరుపుతామని తెలిపింది తప్ప, వైయస్ జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని పేర్కొంది.

న్యాయస్థానాల్లో సాధారణంగా జరిగే న్యాయ ప్రక్రియను కూడా తమ రాజకీయ లబ్ధి కోసం, వైఎస్ జగన్‌పై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కల్పించేందుకు టీడీపీ(TDP) అనుకూల మీడియా వక్రీకరిస్తోందని, “జగన్‌కు సీబీఐ కోర్టులో షాక్”, “వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు” అంటూ పచ్చి అబద్ధాలతో కథనాలు అల్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంలోని సంస్థలను అడ్డంపెట్టుకుని వైఎస్ జగన్‌పై రోజుకో రకంగా రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారు. ఎంత దుష్ప్రచారం చేసినా, ప్రజల మధ్యన నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైయస్ జగన్ మీద ఇటువంటి కుయుక్తులు ఎప్పటికీ నెగ్గవని, ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment