రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మమితా బైజు..

రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మమితా బైజు..

Summarize with AI

‘హను-మాన్’(Hanu-Man) సృష్టించిన ప్రభంజనం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ (Jai Hanuman) ‘కాంతార’(Kantara) ఫేమ్ రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ పాన్-ఇండియా విజువల్ వండర్‌లో(Pan-India Visual Wonder) కనిపించబోయే హీరోయిన్ ఎవరనే అంశంపై గత కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ పడినట్లు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. యూత్ ఆడియన్స్‌లో సెన్సేషనల్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళ క్రష్ మమితా బైజు (Mamitha Baiju) ‘జై హనుమాన్’లో(Jai Hanuman) ఫిమేల్ లీడ్‌గా ఎంపికైనట్లు తెలుస్తుంది.

‘ప్రేమలు’(Premalu) చిత్రంతో కుర్రకారు కలల రాణిగా మారిన ఈ బ్యూటీని, ఒక మైథలాజికల్ యాక్షన్ డ్రామాలో రిషబ్ శెట్టి లాంటి స్టార్ పక్కన రంగంలోకి దించడం ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డివైన్ అండ్ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌లో మమితా పాత్ర ఎంతటి ప్రత్యేకతను సంతరించుకోనుందో అన్నది ఆసక్తి రేపుతోంది. సాధారణంగా ఇలాంటి పాన్-ఇండియా సినిమాల్లో నటీనటులను భారీ పోస్టర్లు, అనౌన్స్‌మెంట్లతో అధికారికంగా పరిచయం చేస్తుంటారు. కానీ ప్రశాంత్ వర్మ మార్క్ సర్‌ప్రైజ్ ఇక్కడే కనిపించింది. ఎలాంటి అధికారిక హడావుడి లేకుండానే మమితా బైజు కొద్ది రోజుల క్రితమే గుట్టుచప్పుడు కాకుండా చిత్ర షూటింగ్‌లో అడుగుపెట్టేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న కీలక షెడ్యూల్‌లో ఆమె రిషబ్ శెట్టితో(Rishab Shetty) కలిసి పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment