ఢిల్లీలో ‘సీజేపీ’ మ‌రో ఉద్య‌మం.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

ఢిల్లీలో 'సీజేపీ' మ‌రో ఉద్య‌మం.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

Summarize with AI

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) తక్షణమే తన పదవికి రాజీనామా(Resignation) చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఒక‌వైపు కాక్రోచ్ జనతా పార్టీ (CJP), మ‌రోవైపు ‘ఇండియా’ (INDIA) కూటమి భారీ నిరసన ప్రదర్శనలతో ఢిల్లీ సరిహద్దులు, ప్రధాన రహదారులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

జంతర్ మంతర్ వద్ద పోలీసుల పహారా
రేపు జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద సీజేపీ(CJP) ఆధ్వర్యంలో జరగనున్న భారీ ఆందోళన దృష్ట్యా ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్ (Jantar Mantar) వైపు వెళ్లే ప్రధాన రహదారులను బారికేడ్లతో మూసివేశారు. మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో ఢిల్లీకి తరలివస్తున్న సీజేపీ మద్దతుదారులను, విద్యార్థులను, యువజన సంఘాల కార్యకర్తలను పోలీసులు సరిహద్దుల్లోనే అదుపులోకి తీసుకుంటున్నారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు, రేపటి నిరసనలపై దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా చేపట్టే నిరసనలు, ధర్నాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, అది చట్టానికి లోబడి మాత్రమే ఉండాలని పేర్కొంది. నిరసనల నెపంతో మెట్రో స్టేషన్లను మూసివేయడం, రైళ్ల రాకపోకలను నిలిపివేసి సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఢిల్లీ పోలీసులను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

భగ్గుమంటున్న విపక్షాలు
ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని, పౌరుల ఓటు హక్కును కాలరాస్తున్నారని సీజేపీ, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం పారదర్శకతను కోల్పోయిందని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ ఆయన తక్షణమే దిగిపోవాలని పట్టుబడుతున్నాయి. దేశ రాజధానిలో ఒకవైపు విపక్షాలు, విద్యార్థి సంఘాల నిరసనల హోరు.. మరోవైపు పోలీసుల ఆంక్షలతో ఢిల్లీలో అత్యంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment