ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) 2024 అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఈవీఎంల(EVMs) ద్వారా భారీ అక్రమాలు జరిగాయని, నాటి ఎన్నికల్లో గెలిచింది చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కాదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సామాజికవేత్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) నిర్వహించిన సర్వే, డేటా విశ్లేషణ అత్యంత వాస్తవానికి దగ్గరగా ఉందని, ఎన్నికల ఫలితాల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు.
ఖమ్మంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) (TUWJ – IJU)ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్'(Meet the Press) కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఏపీ ఎన్నికలపై తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఏపీలోని దాదాపు 1,400 పోలింగ్ బూత్‌లలో(Polling Booths) నమోదు చేసిన ఓట్ల వివరాలను పరిశీలిస్తే, అనేక బూత్‌లలో పోలైన ఓట్ల కంటే 500 ఓట్లు అదనంగా లెక్కించబడ్డాయని వెల్లడైంది. కేవలం 1,500 ఓట్ల గరిష్ట సామర్థ్యం కలిగిన బూత్‌లలో ఏకంగా 2,000 వరకు ఓట్లను లెక్కింపులోకి తీసుకురావడం అత్యంత దారుణమైన అవకతవకలకు అద్దం పడుతోందని తమ్మినేని ధ్వజమెత్తారు.
ఈ సాంకేతిక లోపాలు, ఈవీఎం అక్రమాల వల్ల నిజానికి గెలవాల్సిన అభ్యర్థులు ఓడిపోగా, ఓడిపోవాల్సిన అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు. డేటా సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు సమగ్ర పరిశీలన జరిపిన తర్వాత ఇవేవీ శాతాల లెక్కింపులో వచ్చిన పొరపాట్లు కాదని, స్పష్టమైన అవకతవకలేనని నిర్ధారించారని తెలిపారు. ఈ నివేదికను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించినట్లు వెల్లడించారు.
ఈ ఈవీఎంల(EVMs) అవకతవకలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కాకుండా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దాదాపు 79 లోక్‌సభ స్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంల దుర్వినియోగం వల్ల కేంద్రంలో ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే(Democratic System) తీవ్ర ముప్పు అని హెచ్చరించారు.
ఓట్ల చోరీ(Vote Theft), ఈవీఎం అక్రమాలపై(EVM Irregularities) దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరగాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తక్షణమే సమగ్ర విచారణ మరియు కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) డిమాండ్ చేశారు.








