కల్కి భగవాన్ కన్నుమూత

కల్కి భగవాన్ కన్నుమూత

Summarize with AI

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ (Kalki Bhagavan) (77) కన్నుమూశారు. చెన్నైలోని(Chennai) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో(Private Hospital) గత 10 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన పార్థివదేహాన్ని తిరుపతి జిల్లా(Tirupati District) వరదయ్యపాలెం మండలం బత్తవల్లిలోని ఏకం టెంపుల్‌కు (Ekham Temple) తరలించనున్నారు. భక్తుల సందర్శనార్థం పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. శనివారం ఏకం టెంపుల్ ప్రాంగణంలో అంత్యక్రియలు (Funeral Rites) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే ప్రాంగణంలో కల్కి భగవాన్ స్మారకాన్ని నిర్మించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

విజయ్ కుమార్‌గా (Vijay Kumar) జన్మించిన కల్కి భగవాన్ తొలుత ఉపాధ్యాయుడిగా, అనంతరం ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేశారు. 1992లో తనను తాను ‘కల్కి అవతారం’గా(Kalki Avatar) ప్రకటించుకుని ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందారు. అమ్మ భగవాన్‌తో కలిసి ధ్యానం, ముక్తి దీక్ష తదితర పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన మరణవార్తతో భక్తులు, అనుచరుల్లో విషాదం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment